: రూ.429తో సరికొత్త ప్లాన్‌ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వ రంగ టెల్కో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల ప్రీ-పెయిడ్ వినియోగదారుల కోసం రూ.429 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ను వినియోగదారులు ఎంచుకోవడం ద్వారా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1 జీబీ డేటా చొప్పున 90 రోజులపాటు పొందవచ్చు. ప్లాన్ కాలపరిమితి 180 రోజులు. ఈ నెల నాలుగో తేదీ నుంచే ఈ ఆఫర్ అందుబాటులో ఉందని తెలిపింది.