: మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఏకంగా 4,00,000 ట్వీట్లు చేసిన ఇండియన్లు!


కేంద్ర‌ మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ సంద‌ర్భంగా నిన్న భార‌త‌ నెటిజ‌న్లు 4,00,000 ట్వీట్లు చేశార‌ని ట్విట్ట‌ర్ ఇండియా ఈ రోజు ప్ర‌క‌టించింది. ఇందుకోసం నెటిజ‌న్లు #cabinetreshuffle, #TeamModi, #Modi2019Cabinet, #Ministry4NewIndia హ్యాష్ ట్యాగ్‌ల‌ను ఏర్పాటు చేసుకున్నార‌ని తెలిపింది. వీటి ద్వారా ఆయా కొత్త మంత్రుల‌కు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలిపార‌ని, త‌మ అభిప్రాయాలు పంచుకున్నార‌ని పేర్కొంది. కేంద్ర‌ కేబినెట్‌లోకి వ‌చ్చిన‌ కొత్త ముఖాల‌పై చ‌ర్చించేందుకు భార‌త నెటిజ‌న్లు చాలా ఉత్సాహాన్ని చూపించార‌ని, పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త తీసుకొచ్చేందుకు మోదీ చేసిన ప్ర‌య‌త్నాన్ని ప్రోత్స‌హించార‌ని తెలిపింది.        

  • Loading...

More Telugu News