: నిర్మలా సీతారామన్ ఆవకాయ పచ్చడి పెడుతున్న నాటి వీడియో వైరల్!
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మినహా ఇంతవరకు ఎవరూ పర్యవేక్షించని రక్షణ శాఖ బాధ్యతలు నిర్మలా సీతారామన్ ని వరించిన విషయం తెలిసిందే. అయితే, నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రి అయిన తర్వాత నాటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. గతంలో మంత్రిగా ఉన్న ఆమె, తమ ఇంటి వ్యవహారాల్లో.. ముఖ్యంగా పచ్చళ్లు పెట్టడం వంటి విషయాల్లో ఆమె ఆసక్తి కనబరిచేవారు.
ఈ విషయాన్ని తెలియజేస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సుమారు నాలుగేళ్ల కిందటి ఈ వీడియోలో.. నిర్మలా సీతారామన్ తన తల్లితో కలిసి ఆవకాయ పెడుతున్నారు. నాడు తీసిన ఈ వీడియోను ఓ యూ ట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేశారు. ఈ యూ ట్యూబ్ చానెల్ ఏపీ ప్రత్యేక సలహాదారు, నిర్మలా సీతారామన్ భర్త అయిన పరకాల ప్రభాకర్ కు చెందినదే కావడం గమనార్హం.