: నాగచైతన్య కొత్త సినిమాకి యూ/ఏ స‌ర్టిఫికేట్!


అక్కినేని నాగచైతన్య, లావణ్య త్రిపాఠి నటిస్తోన్న యుద్ధం శరణం సినిమాకి యూ/ఏ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. ఈ సినిమాను ఈ నెల 8న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. వారాహి చలనచిత్రం పతాకంపై, కృష్ణ ఆర్‌.వి. మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఇందులో న‌టుడు శ్రీకాంత్‌ నెగటివ్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. వివేక్ సాగ‌ర్ స్వ‌ర‌ప‌ర్చిన ఈ సినిమా పాట‌ల‌ను సామాజిక మాధ్య‌మాల ద్వారా ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేశారు.        

  • Loading...

More Telugu News