: నోట్ల రద్దు విషయంలో నేను గతంలో చెప్పిందే నిజమైంది!: శరద్ యాదవ్
నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం చెప్పిన లక్ష్యాల్లో ఏ ఒక్కదాన్ని కూడా చేరుకోలేకపోయిందని జేడీయూ నేత శరద్ యాదవ్ అన్నారు. నోట్ల రద్దుతో దేశ ప్రజలను బీజేపీ మోసం చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చిందని... తద్వారా 50 నుంచి 60 శాతం వరకు ఆదాయాలను కోల్పోయారని చెప్పారు. సరైణ ప్రణాళిక లేకుండా తీసుకున్న నిర్ణయంతో కోట్లాది ప్రజలు నానా అవస్తలు పడ్డారని అన్నారు. నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన ఇబ్బందుల నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని అన్నారు. నోట్ల రద్దుకు సంబంధించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలన్నీ నిజమయ్యాయని ఆయన చెప్పారు.