: కదలకుండా బొమ్మలా నిలబడ్డ సెక్యూరిటీ గార్డ్ పక్కన డ్యాన్స్ చేసిన నటి ఆదా శర్మ.. మీరూ చూడండి!
‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన నటి ఆదా శర్మ సోషల్ మీడియాలో ప్రతిరోజూ వెరైటీ వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తుంటోంది. ఈ రోజు ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. అందులో బొమ్మలా నిలబడి ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్ పక్కన నిలబడి ఆమె డ్యాన్స్ చేసింది. సెక్యూరిటీ గార్డులు అస్సలు కదలరని అనుకున్నానని, అయితే, ఆ వ్యక్తి ఒక్కసారిగా కదలగానే గుండె ఆగినంత పనైందని ఆమె చెప్పింది. ఆ సెక్యూరిటీ గార్డ్ కదలగానే ఆదా శర్మ మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ వీడియోను మీరూ చూడండి..