: బ్రిక్స్ ఆర్థిక, సాంకేతిక సహకార ప్రణాళిక కోసం చైనా భారీ నిధులు


చైనాలో బ్రిక్స్ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికాల అగ్రనేతలు బ్రిక్స్ దేశాల పురోగతి, పరస్పర సహకారంపై చర్చిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బ్రిక్స్ ఆర్థిక, సాంకేతిక స‌హ‌కార ప్ర‌ణాళిక కోసం చైనా భారీగా నిధులు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఈ విష‌యంపై ప్ర‌క‌ట‌న చేస్తూ... మొత్తం రూ.487 కోట్లు స‌మ‌కూర్చనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అందులో బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకు ప్రాజెక్టుల‌కు రూ.26 కోట్లు కేటాయించిన‌ట్లు చెప్పారు. బ్రిక్స్ దేశాలు పురోగ‌తి సాధిస్తున్నాయని ఈ సంద‌ర్భంగా జీ జిన్ పింగ్ అన్నారు.

  • Loading...

More Telugu News