: 20,000 సాధారణ బెలూన్లతో 9 గంటల పాటు గాల్లో ధ్యానం!
సాధారణ హీలియం బెలూన్లను ఉపయోగించి, 9 గంటల పాటు గాల్లో ధ్యానం చేసే విన్యాసాన్ని ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపేరా హౌస్‌లో నోమీ లాకమెయిర్ అనే కళాకారిణి ప్రదర్శించింది. షెరోఫోబియా (ఆనందం వల్లే కలిగే భయం)ను ప్రదర్శించడానికి ఆమె ఈ విన్యాసాన్ని ఎంపిక చేసుకుంది. మొదట 20,000 బెలూన్లను హీలియంతో నింపి, ఒక్కటిగా కట్టి విన్యాసానికి కావాల్సిన విధంగా అమర్చారు
తర్వాత ఒక చెక్క మీద ఆమె పడుకుని ఉండగా బెలూన్లను గాల్లోకి వదిలారు. నెమ్మదిగా ఆమె గాల్లోకి ఎగిరిన తర్వాత బెలూన్లను నియంత్రిస్తారు. ఎగురుతున్నామన్న ఆనందం ఒకపక్క, బెలూన్లు పగిలిపోతే ఎక్కడ పడిపోతామోనన్న భయం మరో పక్క ఉండే పరిస్థితిని షెరోఫోబియా ఉన్నవాళ్లు అనుభవిస్తారని ఆమె వివరించారు. ఈ విన్యాసం ద్వారా వారి పరిస్థితిని తెలియజేసే ప్రయత్నం చేసినట్లు ఆమె తెలిపారు. గతంలో లండన్ చర్చిలో కూడా ఆమె ఈ విన్యాసాన్ని ప్రదర్శించారు. ఆ వీడియోను కింద చూడొచ్చు.