: రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ముందుగానే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం
గణేశ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ చెప్పారు. ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ మహాగణపతిని ముందస్తుగానే నిమజ్జనం చేయిస్తామని అన్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. నిమజ్జనం సందర్భంగా రేపు హైదరాబాద్‌లో 26 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. 18 ప్లటూన్ల కేంద్ర బలగాలు కూడా హైదరాబాద్ చేరుకున్నాయని చెప్పారు. నగరంలోని ప్రధాన ఊరేగింపు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు చెప్పారు. నిమజ్జనం సందర్భంగా నగరంలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులను, ప్రతి అర్ధగంటకు ఒక ఎంఎంటీఎస్ రైలును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.