: డేరా బాబా స్థావరంపై దాడి...ఆయుధాలు, డబ్బు స్వాధీనం


హర్యాణాలోని డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ ఆశ్రమంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా సిర్సాలోని డేరా సచ్ఛా సౌధా ఆశ్రమంలో తలదాచుకున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆశ్రమంలో ఏకే 47 రైఫిల్స్, స్నైపర్ గన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ శ్రేణులకు చెందిన 35 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో పెద్దఎత్తున నగదు కూడా లభ్యమైనట్టు తెలుస్తోంది. అయితే నగదు ఎంత అన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News