: ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం పోటీ పడుతున్న 14 సంస్థలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కుల వేలంలో 14 మీడియా సంస్థలు తమ బిడ్లను దాఖలు చేశాయి. వీటిలో స్టార్ ఇండియా, సూపర్ స్పోర్ట్, యప్ టీవీ, ఫేస్‌బుక్, ఎయిర్‌టెల్, ఇకోనెట్, రిలయన్స్ జియో, డీఏజెడ్ఎన్, టైమ్స్ ఇంటర్నెట్, బెయిన్, సోనీ, ఫాలో ఆన్ ఇంటరాక్టివ్, ఓఎస్ఎన్ (గల్ఫ్ డీటీహెచ్ ఎల్ఎల్‌సీ), బామ్ టెక్ సంస్థలు ఉన్నాయి.
అమెరికన్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్, డిస్కవరీలు కూడా బిడ్ వేసేందుకు ప్రయత్నించాయి, కానీ చివరి నిమిషంలో విరమించుకున్నట్లు తెలుస్తోంది. వీటిలో 2018-22 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే హక్కులను ఏ సంస్థ గెల్చుకుంటుందో ఈరోజు తెలుస్తుంది. ప్రసార హక్కులను అంతర్జాతీయ, ప్రాంతీయ హక్కులుగా మార్చి వేర్వేరుగా వేలం వేయనున్నారు. భారత్, పశ్చిమాసియా, ఆఫ్రికా, యూరప్, అమెరికా ప్రాంతాలకు ప్రత్యేక ప్రసార హక్కులతో పాటు మొత్తం ప్రపంచ వ్యాప్త ప్రసార హక్కులను విడివిడిగా వేలం వేస్తారు.