: మూడు వన్డేలకు మించి గెలవలేరనే వాదన తప్పని నిరూపించాం: కోహ్లీ
భారత్ వరుసగా మూడు వన్డే మ్యాచ్ లకు మించి గెలవలేదనే వాదన ఉందని... శ్రీలంక సిరీస్ లో వరుసగా ఐదు మ్యాచ్ లను గెలిచి ఆ వాదన తప్పని నిరూపించామని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. వెస్టిండీస్ పై కూడా వరుసగా ఆరు మ్యాచ్ లను గెలిచి చూపించామని చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ లో కూడా ఇదే రకమైన ఆటతీరును ప్రదర్శిస్తామని తెలిపాడు.
పరిమిత ఓవర్ల మ్యాచ్ లు ఎప్పుడూ సవాలే అని చెప్పిన కోహ్లీ... ప్రస్తుతం తాము అత్యున్నత క్రికెట్ ఆడుతున్నామని అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా ఆడుతున్నాడని... హార్ధిక్ రాటు దేలుతున్నాడని... స్పిన్నర్లు మంచి ప్రదర్శనను కనబరుస్తున్నారని చెప్పాడు. శ్రీలంక ప్రజలు తమను ఎంతో ఆదరించారని, తమ ఆట తీరును ప్రశంసించారని, మరోసారి తాము శ్రీలంక పర్యటనకు రావాలని కోరుకుంటారని తెలిపాడు.