: శశికళతో భేటీ కానున్న దినకరన్!
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళతో ఆ పార్టీ బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ నేడు భేటీ కానున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్వహించనున్న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంతో పాటు ప్రస్తుత రాజకీయాలపై శశికళతో ఆయన చర్చించనున్నారు. మరోవైపు, శశికళ తరపున కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఈ పిటిషన్ కు సంబంధించి సీనియర్ లాయర్లతో చేపట్టిన చర్చల వివరాలను కూడా శశికళకు ఆయన వివరించనున్నారు.