anushka: 'సైరా'లో అనుష్క ఛాన్స్ మిస్ కావడానికి కారణం అదేనట!


చిరంజీవి కథానాయకుడిగా చారిత్రక నేపథ్యంలో 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా అనుష్కను తీసుకునే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. అనుష్క అంగీకరించే ఛాన్స్ ఉందంటూ చెప్పుకున్నారు.

 అయితే ఈ సినిమా టీమ్ అనుష్కను సంప్రదించడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలోగా ఆ ప్లేస్ లోకి నయనతార వచ్చేయడం జరిగిపోయాయట. అందుకు కారణం అనుష్క బాగా లావుగా కనిపిస్తూ వుండటమేనని చెప్పుకుంటున్నారు. ఈ కారణంగానే ఆమె 'సాహో' మూవీలోనూ ఛాన్స్ కోల్పోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు విషయాలు హర్ట్ చేయడంతో .. అనుష్క బరువు తగ్గే పనిపైనే పూర్తి దృష్టి పెట్టిందట. పర్సనల్ ట్రైనర్ ను పెట్టుకుని జిమ్ లోనే ఎక్కువ సమయం గడుపుతోందని చెప్పుకుంటున్నారు.  

  • Loading...

More Telugu News