: యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించిన షరపోవా


డోపింగ్ టెస్ట్ లో పట్టుబడి కొన్ని నెలల పాటు నిషేధం ఎదుర్కొని... యూఎస్ ఓపెన్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన రష్యన్ అందాల తార షరపోవా పోరాటం ముగిసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా టోర్నీలో ఆడిన ఆమె... నాలుగో రౌండ్ లో ఓటమిపాలైంది. అనస్తాసిజా సెవస్తోవా చేతిలో షరపోవా 7-5, 4-6, 2-6 తేడాతో ఓటమిపాలైంది. ఈ గెలుపుతో సెవస్తోవా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. అమెరికాకు చెందిన స్లోయెన్ స్టీఫెన్స్ తో ఆమె క్వార్టర్స్ లో తలపడుతుంది.

  • Loading...

More Telugu News