: ఉత్తరకొరియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా!
చైనాలోని జియామెన్ లో బ్రిక్స్ సదస్సు ప్రారంభమైంది. సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాధినేతలు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరంతర అణ్వాయుధ పరీక్షలతో ఉత్తరకొరియా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఉత్తరకొరియా తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. విద్వేషాలు, రెచ్చగొట్టే ప్రకటనలు మంచిది కాదని అన్నారు. ఉత్తరకొరియా ప్రకటనలు, చేస్తున్న క్షిపణి పరీక్షలు ప్రపంచ శాంతికి విఘాతంగా మారుతున్నాయని మండిపడ్డారు.