: ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు .. గౌతంరెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేశాం: వైసీపీ నేత పార్థసారధి


దివంగత వంగవీటి రాధ, రంగాలపై వైసీపీ నేత గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో ఆయనకు ఆ పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. ఈ సందర్భంగా వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ, పూనూరు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

పార్టీ నేతలు ఏ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి వంగవీటి రంగా మంచి స్నేహితుడని, వంగవీటి రంగాను తాము ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటామని అన్నారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News