: వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి కారు ఢీ కొట్టడంతో రైతు మృతి!


వైసీపీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి కారు ఢీకొని ఓ రైతు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమళ్ళ వద్ద శనివారం రాత్రి జరిగింది. గిద్దలూరు నుంచి ఒంగోలుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంకటనారాయణ అనే రైతు తన ట్రాక్టర్‌ నడుపుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. వెనుక నుంచి వేగంగా వస్తున్న ఎంపీ కారు ఈ ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో, వెంకటనారాయణ కింద పడిపోవడం... ఆయనపైకి ట్రాక్టర్‌ ఎక్కడం జరిగింది. దీంతో, అక్కడికక్కడే ఆయన మృతి చెందాడు.

అయితే కారులో ఉన్న ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, డ్రైవర్‌, గన్‌మెన్‌లు మాత్రం క్షేమంగా ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే ఎంపీ సుబ్బారెడ్డి జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబుకు, 108 సిబ్బందికి  సమాచారం అందించారు. వెంకటనారాయణ అప్పటికే మృతి చెందినట్టు 108 సిబ్బంది నిర్ధారించి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎంపీ సుబ్బారెడ్డి తన కారును, డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించి మరో కారులో ఆయన ఒంగోలు వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News