: నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలపై పీ-పోల్ సర్వే ప్రచురించిన న్యూస్ ఎడిటర్ అరెస్ట్!


ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలపై ప్రీ-పోల్ సర్వే ప్రచురించిన ఓ ప్రాంతీయ పత్రిక న్యూస్ ఎడిటర్‌ను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 23న ‘నేటి భారతం డాట్ కామ్’లో కూన అజయ్ బాబు ప్రీ-పోల్ సర్వే ఫలితాలను పబ్లిష్ చేశారు. ఏపీ సీఎంవో కార్యాలయం నుంచి లీకైన ఇంటెలిజెన్స్ వివరాలను బట్టి వైసీపీ 4551 ఓట్ల తేడాతో విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. అయితే ప్రీ-పోల్ సర్వేను ప్రచురించడం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కిందకు వస్తుందంటూ రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ‘నేటి భారతం డాట్ కామ్’‌ హైదరాబాద్‌కు చెందిన వెబ్ డిజైనర్ డి.రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు గుర్తించారు. దీనికి ఓ ప్రాంతీయ పత్రికలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నకూన అజయ్ బాబు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. కల్పిత పత్రాలతో ప్రీ-పోల్ సర్వే ఫలితాలు ప్రచురించిన నేరం కింద ఇద్దరినీ అదుపులోకి తీసుకుని జుడీషియల్ కస్టడీకి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News