: ఉత్తరకొరియాపై అమెరికా దాడి చేస్తే చైనాకు జరిగే నష్టం ఇదే!


ఉత్తరకొరియాకు చైనా ఆప్తమిత్రదేశమన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణశాఖకు నిఘావ్యవస్థ నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో ఉత్తరకొరియాపై దాడి చేస్తే దానితో వ్యాపార సంబంధాలు కొనసాగించే చైనాపై ప్రభావం ఎలా ఉంటుంది? అన్నది ఆ నివేదికలో తెలిపారు. ఉత్తరకొరియాపై అమెరికా దాడి చేస్తే చైనాలో క్రూడ్ ఆయిల్ ధరలు చుక్కలను తాకుతాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. చైనా క్రూడ్ ఆయిల్ రిజర్వులు ఎక్కువగా ఉత్తరకొరియా సరిహద్దుల్లోనే ఉన్నాయని ఆ నివేదికలో తెలిపింది.

 చైనాకు చెందిన 58 శాతం క్రూడ్ ఆయిల్ రిజర్వులు ఉత్తరకొరియాలోనే ఉన్నాయని వెల్లడించింది. ఈ రిజర్వులు చైనాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని తెలిపింది. ఇక్కడి నుంచి ప్రతి రోజూ 3 లక్షల 90 వేల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ రవాణా అవుతుందని ఆ నివేదిక వెల్లడించింది. ఉత్తరకొరియాపై అమెరికా విరుచుకుపడితే దాని ప్రభావం చైనా మీద క్రూడ్ ఆయిల్ రూపంలో పడుతుందని ఆ నివేదిక తెలిపింది. ఉత్తరకొరియాపై దాడి జరిగిన మరుక్షణం చైనాలో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉందని ఈ నివేదిక అభిప్రాయపడింది. 

  • Loading...

More Telugu News