: తన అభిమానుల చెంప ఛెళ్లుమనిపించిన ఘటనలపై స్పందించిన బాలకృష్ణ!
సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పలుసార్లు తన అభిమానుల చెంపఛెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయనపై సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు వచ్చాయి. తాను నటించిన ‘పైసా వసూల్’ సినిమా విడుదలైన సందర్భంగా తాజాగా బాలయ్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. ఆ విధంగానైనా తనను తాకినందుకు తన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను అలా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుందనే విషయం తనకు తెలుసని, ఇతరులు ఈ అంశంపై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనని అన్నారు.
తాను అభిమానులపై ప్రదర్శించిన తీరుపై మీడియా తప్పుగా వార్తలు ప్రసారం చేసిందని బాలయ్య చెప్పుకొచ్చారు. తన ప్రవర్తన నంద్యాల ఎన్నికల ఫలితాలపై కూడా పడుతుందని అన్నారని, కానీ పడిందా? అని ప్రశ్నించారు. అలాగే, తన సినిమాలపై పైరసీ ప్రభావం పడదని, తన అభిమానులు థియేటర్లకి వెళ్లే చూస్తారని అన్నారు.