: రేపటి మ్యాచ్ లో మా జట్టు టీమిండియాపై సత్తా చూపిస్తుంది: శ్రీలంక క్రికెటర్ మాథ్యూస్


శ్రీలంక‌, భార‌త్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య రేపు కొలంబోలో చివ‌రి వ‌న్డే జ‌ర‌గ‌నుంది. ఐదు వ‌న్డే మ్యాచుల సిరీస్ లో ఇప్ప‌టికే టీమిండియా 4-0 ఆధిక్యంతో ఉంది. రేప‌టి మ్యాచ్‌ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాల‌ని భావిస్తోంది. కాగా నాలుగో వ‌న్డేలో రాణించిన శ్రీలంక క్రికెట‌ర్ మాథ్యూస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ రేప‌టి మ్యాచ్‌లో గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. వ్యక్తిగతంగా వన్డేల్లో త‌న‌ ప్రదర్శనపై తాను తీవ్ర నిరాశలో ఉన్నానని తెలిపాడు. తాను ఔటవుతున్న తీరు బాధక‌లిగిస్తోందని అన్నాడు. త‌న బ్యాటింగ్ తీరు త‌న‌కే విసుగుక‌లిగిస్తోంద‌ని అన్నాడు. రేపటి మ్యాచ్‌లోనైనా త‌మ జ‌ట్టు బాగా ఆడాలని ప‌ట్టుద‌ల‌తో ఉంద‌ని చెప్పాడు. మిగిలి ఉన్న‌ ఈ ఒక్క మ్యాచ్‌లో త‌మ జ‌ట్టు తప్పకుండా గెలిచి సత్తా చూపిస్తుందని వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News