: హైదరాబాద్‌కు రానున్న దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు


త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి, ఉప ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వంపై ఆగ్రహం వ్య‌క్తం చేస్తోన్న దినక‌ర‌న్ వ‌ర్గం ప్ర‌భుత్వాన్ని కూల్చేయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దిన‌క‌ర‌న్ మ‌ళ్లీ క్యాంపు రాజ‌కీయాల‌కు తెర‌తీసి, త‌న‌వైపు ఉన్న‌ 21 మంది ఎమ్మెల్యేలను రిసార్టుల్లో ఉంచుతున్నారు, ఇప్పుడు వీరంతా త‌మ‌ రాజకీయ మకాంను హైదరాబాద్‌కు మార్చనున్నట్లు సమాచారం.

ప్ర‌స్తుతం వారు పుదుచ్చేరిలోని ఒక రిసార్టులో ఉంటున్నారు. సీఎం వర్గం నుంచి త‌మ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లోను కాకుండా ఉండేందుకు దిన‌క‌ర‌న్‌ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రేపు దిన‌క‌ర‌న్ వ‌ర్గం ఎమ్మెల్యేలు హైద‌రాబాద్‌కి రానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5న వారు తమ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ను కలుస్తారు. 

  • Loading...

More Telugu News