: ఇక వదంతులు ఆపండి.. నేను బతికే ఉన్నాను!: టీవీ నటి దివ్యాంక త్రిపాఠి
పలు హిందీ సీరియళ్లు, టీవీ షోలతో పాప్యులర్ అయిన ప్రముఖ టీవీ నటి దివ్యాంక త్రిపాఠి మృతి చెందిందంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేయడంతో దీనిపై ఆమె స్పందించింది. తాను చనిపోయినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని, తాను బతికే ఉన్నానని ట్విట్టర్‌లో పేర్కొంది.
ఇటువంటి ప్రచారం చేసి తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించొద్దని కోరింది. దివ్యాంక నటించిన తొలి సీరియల్ 'మే తేరి దుల్హాన్'కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఆమె బుల్లితెరపై వెలిగింది. గత ఏడాది ఆమెకు టీవీ సహనటుడు వివేక్ దహియాతో పెళ్లి జరిగింది. ఆమె సినిమాల్లోనూ నటించడానికి ప్రయత్నాలు జరుపుతోంది.