: విశాఖపట్నం ఎంపీ హరిబాబుకి ఢిల్లీ నుంచి ఫోన్.. కుటుంబ సభ్యులతో కలిసి రాజధానికి పయనం!
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రులుగా రేపు ఎవరెవరితో ప్రమాణ స్వీకారం చేయించాలన్న విషయంపై బీజేపీ అధిష్ఠానం స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి విశాఖపట్నం బీజేపీ ఎంపీ హరిబాబుకి కొద్ది సేపటి క్రితం ఫోన్ వచ్చింది. దీంతో విజయవాడలో వున్న ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు చోటు లభించే అవకాశం ఉంది.