: ‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మ్యూజిక్ స‌ర్‌ప్రైజ్ 25’ వీడియోపై రాజమౌళి ప్రశంసలు


సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ‘#PSPK25 మ్యూజిక్ స‌ర్‌ప్రైజ్’ పేరుతో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ యూ ట్యూబ్ ఖాతాతో పాటు సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ స‌మ‌కూర్చిన‌ ఈ మ్యూజిక్‌పై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌శంస‌లు కురిపించారు. ‘సింపుల్ మెలోడి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సింగిల్ షాట్ తో ఎంతో ప్ర‌భావ‌వంతంగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ స్టైల్‌లో రూపొందించారు’ అని ఈ వీడియోపై రాజమౌళి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. కాగా, ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ రూపొందిస్తోన్న సినిమాకు ఇంకా పేరును ఖ‌రారు చేయ‌లేదు.   

  • Loading...

More Telugu News