: జగన్ డ్రామా ట్రూప్ పెడతాడు.. రోజా రికార్డింగ్ డ్యాన్సులు చేస్తుంది: అయ్యన్నపాత్రుడు


వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా అంటేనే ఓ దరిద్రం అని... ఆమె ఎక్కడ అడుగు పెడితే, అక్కడ నాశనమే అని అన్నారు. రోజా మాట్లాడుతున్న మాటలకు ఆడవారే సిగ్గుతో తలదించుకుంటున్నారని విమర్శించారు. జబర్దస్త్ షోలో డాన్సులు చేసుకునే రోజాకు మహిళల గురించి మాట్లాడే అర్హత కూడా లేదని అన్నారు. వైసీపీ అధినేత జగన్ పని అయిపోయిందని... పార్టీ జెండా పీకేసి, ఆయన డ్రామా కంపెనీ పెట్టుకుంటారని... అందులో రోజా రికార్డింగ్ డాన్సులు చేయడం తథ్యమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో... ఆ పార్టీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారని అన్నారు. 

  • Loading...

More Telugu News