: ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌.. అరుణ్ జైట్లీతో చర్చలు!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. రేపు ప్ర‌ధాని మోదీ మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కేసీఆర్ చ‌ర్చ‌లు జ‌రుపుతుండ‌డం ఆస‌క్తికరంగా మారింది. కేంద్ర కేబినెట్‌లో టీఆర్ఎస్ కూడా చేరుతుందా? అనే అంశంపై ఇటీవ‌ల వార్త‌లు హల్‌చ‌ల్ చేశాయి. అయితే, బీజేపీ రాష్ట్ర నేత‌లు మాత్రం అటువంటిదేమీ ఉండ‌బోద‌ని తేల్చి చెబుతున్నారు. మ‌రోవైపు సీఎంవో ఈ విష‌యంపై స్పందిస్తూ... కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు, కేంద్ర కేబినెట్‌ విస్తరణకు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం రక్షణశాఖ భూములు అప్పగించాలని కోరుతూ కేసీఆర్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. 

  • Loading...

More Telugu News