: మయన్మార్ లో 400 మంది ముస్లింల ఊచకోత!


మయన్మార్ దేశం మత కల్లోలాలతో అట్టుడుకుతోంది. రఖైన్ రాష్ట్రంలో మొదలైన హింసాకాండ రావణకాష్టంలా రగులుతోంది. రోహింగ్యా ముస్లింల నెత్తురుతో తడుస్తోంది. తాజాగా రోహింగ్యా మిలిటెంట్లు ఆర్మీ పోస్టులపై విరుచుకుపడ్డారు. దీంతో, ఆర్మీ నరమేధానికి దిగింది. ఆర్మీ దాడులతో సుమారు 400 మంది రోహింగ్యా ముస్లింలు మరణించారు.

మయన్మార్ లో బౌద్ధ మతస్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. రోహింగ్యా ముస్లింల సంఖ్య చాలా తక్కువ. బౌద్ధులకు, ముస్లింలకు మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా మత పరమైన సంక్షోభం అధికమైంది. సైన్యం, రోహింగ్యా ముస్లింల మధ్య జరుగుతున్న మారణహోమంలో రఖైన్ రాష్ట్రంలోని వందలాది గ్రామాలు ఇప్పటికే తగలబడిపోయాయి. ఆర్మీ ఉక్కుపాదం మోపుతుండటంతో రోహింగ్యా ముస్లింలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కు పారిపోతున్నారు.


  • Loading...

More Telugu News