: ఆ పని చేయకపోతే నీవు కూడా 'ఫేక్ పవర్ స్టార్'లా ఫేక్ అయిపోతావు!: నితిన్ పై వర్మ కామెంట్స్


తెలంగాణకు చెందిన హీరో నితిన్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న హీరో విజయ్ దేవరకొండను రియల్ పవర్ స్టార్ గా నితిన్ ఒప్పుకోకపోతే... ఫేక్ పవర్ స్టార్ లా నితిన్ కూడా ఫేక్ అయిపోతాడని ఫేస్ బుక్ లో కామెంట్ చేశాడు. రియల్ సూపర్ డ్యూక్ స్టార్ మహేష్ బాబు విజయ్ సాధించిన విజయం పట్ల స్పందించాడని... ఫేక్ పవర్ స్టార్ ఇంత వరకు సైలెంట్ గానే ఉన్నాడని ఎద్దేవా చేశాడు.

'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి తన కంటే గొప్ప దర్శకుడని ఈ సందర్భంగా వర్మ అన్నాడు. విజయ్ దేవరకొండ తన కంటే గొప్ప యాక్టర్ అని తెలంగాణ స్టార్ నితిన్ చెబుతాడేమోనని తాను ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు. 'అర్జున్ రెడ్డి'కి వస్తున్న స్పందన పట్ల మహేష్ బాబు ప్రశంసలు కురిపించడాన్ని వర్మ స్వాగతించాడు. విజయ్ దేవరకొండలాంటి కొత్త నటుడిపై మహేష్ బాబులాంటి ఓ సూపర్ స్టార్ ప్రశంసలు కురిపించడం సామాన్యమైన విషయం కాదని అన్నాడు. మహేష్ బాబుపై తనకున్న గౌరవం 10 రెట్లు పెరిగిందని చెప్పాడు. ఇతర స్టార్లు కూడా మహేష్ లాగానే స్పందిస్తారో లేక సైలెంట్ గా ఉండిపోతారో వేచి చూడాలని అన్నాడు.

  • Loading...

More Telugu News