: పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. "పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా", అంటూ ట్వీట్ చేశారు.
ఇదే సందర్భంగా ముస్లింలకు ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సామరస్యం, సంతోషం, శ్రేయస్సులు కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు.