: వాకపల్లి గ్యాంగ్‌రేప్ కేసులో ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు అల్టిమేటం.. ఆరు నెలల్లో కేసు విచారణను పూర్తి చేయాలని ఆదేశం
విశాఖపట్టణం జిల్లా వాకపల్లిలో 11 మంది గిరిజన యువతులపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలంటూ ఏపీ సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని మేజిస్ట్రేట్ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ పోలీస్ అధికారి ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లో కేసు విచారణను పూర్తి చేయాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, ఎంఎం. శంతనగౌడెర్‌లతో కూడిన ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు కావాలనే విచారణను ఆలస్యం చేస్తున్నారని బాధితుల తరపున కోర్టుకు హాజరైన న్యాయవాది వృందా గ్రోవర్ ఆరోపించారు.