: ‘బ్లూవేల్’ కోరల్లోంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థి.. చేతిపై గాయం.. టీచర్ అప్రమత్తతతో నిలిచిన ప్రాణాలు!


కర్ణాటకలోని మంగళూరుకు చెందిన హైస్కూలు విద్యార్థి ప్రమాదకర బ్లూ వేల్ గేమ్ కోరల్లో నుంచి తృటిలో తప్పించుకున్నాడు. టీచర్ అప్రమత్తత అతడి ప్రాణాలను నిలిపింది. బాలుడి తండ్రి విదేశాల్లో ఉండగా తల్లి నగరంలోనే ఉంటూ కుమారుడిని చదవిస్తోంది. తెలివైన విద్యార్థి అయిన అతడి ప్రవర్తనలో ఇటీవల మార్పు రావడాన్ని  టీచర్ గమనించింది. క్లాస్‌లో డల్‌గా ఉండడం, హోంవర్క్ పూర్తి చేయకపోవడం, స్కూలు ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం, దేని గురించో నిత్యం ఆలోచిస్తుండడంతో అనుమానం వచ్చిన టీచర్ విషయాన్ని అతడి తల్లికి తెలియజేసింది.

కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను బ్లూవేల్ గేమ్ ఆడుతున్నానని, తనను తాను హింసించుకునేందుకు ప్రయత్నించానని చెప్పి, అందులో భాగంగా చేతిపై గాయాలు చేసుకున్నట్టు చూపించడంతో వారు అవాక్కయ్యారు. కీడు శంకించి వెంటనే అతడికి కౌన్సెలింగ్ ఇప్పించడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రస్తుతం అతడు సాధారణ స్థితికి చేరుకున్నట్టు విద్యార్థి తల్లి పేర్కొంది. విద్యార్థి విషయం తెలిశాక స్కూలు యాజమాన్యం అప్రమత్తమైంది. పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలంటూ తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపింది.

  • Loading...

More Telugu News