: కాషాయానికి దూరంగా ఉంటా.. వామపక్ష నేతలు హీరోలు: కమల హాసన్
నటుడు కమల హాసన్ ఈ రోజు కేరళకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వామపక్ష నేతలను హీరోలు అని వ్యాఖ్యానించిన కమల్.. తాను కాషాయానికి మాత్రం దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. నలభై ఏళ్లుగా సినిమాల్లో తన వేష భాషలు, హావభావాలను ప్రజలు చూశారని, అవన్నీ తాను కాషాయానికి దూరమన్న విషయాన్ని కూడా తెలుపుతాయని వ్యాఖ్యానించారు. వామపక్షాలతో కలిసి పనిచేస్తారా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్నకు సమాధానం కోసం వేచిచూడాలని అన్నారు. కేరళ ముఖ్యమంత్రితో ఏం మాట్లాడారన్న విషయాన్ని మాత్రం కమల్ చెప్పలేదు.