: రూ.500, 2000 నోట్లతో బాలయ్య పోస్టర్!
పూరీ జగన్నాథ్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమా థియేటర్ల ముందు అభిమానుల హంగామా కనపడుతోంది. హైదరాబాద్‌లోని మంజు థియేటర్ ముందు ఏర్పాటు చేసిన బాలకృష్ణ పోస్టర్‌పై అభిమానులు రూ.500, రూ. 2000ల నోట్లతో దండలు వేశారు. ఓ అభిమాని ఈ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా, దాన్ని నటి ఛార్మి రీట్వీట్ చేసింది. ‘పైసా వసూల్’ సినిమాలో బాలయ్య డైలాగులు అదుర్స్ అంటూ ఆయన అభిమానులు థియేటర్ల ముందు పండుగ చేసుకుంటున్నారు.