: ఆ ఫొటో గురించి అడిగితే విజయ్ దేవరకొండ నవ్వేశాడు!
‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండకు సంబంధించిన చిన్నప్పటి ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ఇటీవల దర్శన మిచ్చింది. ఈ ఫొటో విషయమై విజయ్ దేవరకొండను తాజాగా ప్రశ్నించగా .. ‘అసలు, నా చిన్నప్పటి ఫొటో ఎలా దొరికిందో నాకు తెలియడం లేదు. ఆ ఫొటో నేను టెన్త్ క్లాసు చదువుతున్నప్పుడు దిగింది. ఆ ఫొటో చూడగానే, నా గురించి అభిమానులు ఇంతగా సెర్చ్ చేస్తున్నారా ! అనిపించింది. ఆ ఫొటోలో పాల బుగ్గలతో నేను ఎలా ఉన్నానో చూడండి!’ అంటూ విజయ్ నవ్వులు చిందించాడు.