: డబ్బు కోసమే ఆమె మాపై తప్పుడు ఆరోపణలు చేసింది: హీరో సృజన్, దర్శకుడు చలపతి
ఓ వర్ధమాన సినీ హీరోయిన్ పై అత్యాచారం చేయబోయారనే కేసులో హీరో సృజన్, దర్శకుడు చలపతిలకు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. వీరికి విధించిన రిమాండ్ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ ఆరోపణలను వీరిద్దరూ ఖండించారు. కారులో ఆమెపై తాము ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని చెప్పారు. కారు ప్రమాదానికి గురవడంతో ఆమె ఆందోళన చెందిందని... తమతో పాటే ఆసుపత్రిలో చికిత్స తీసుకుందని తెలిపారు. కేవలం డబ్బు కోసమే ఆమె తమపై తప్పుడు ఆరోపణలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో వెళుతున్న సమయంలో హీరో, డైరెక్టర్ ఇద్దరూ తనపై అత్యాచార యత్నం చేశారని సదరు వర్ధమాన హీరోయిన్ విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వీరిద్దరినీ అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపించారు.