: కేంద్ర కేబినెట్ నుంచి దత్తాత్రేయకు ఉద్వాసన.. గవర్నర్ గా ఛాన్స్?
కేంద్ర కేబినెట్ నుంచి బండారు దత్తాత్రేయకు ఉద్వాసన పలకనున్నారు. దత్తన్నను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలిపించుకుని మాట్లాడారు. ఈ భేటీలో ఈ విషయాన్ని దత్తాత్రేయకు అమిత్ షా స్పష్టం చేశారు. భేటీ అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ, తనకు గవర్నర్ పదవిని ఇస్తామంటూ పార్టీ హామీ ఇచ్చిందని చెప్పారు. ఆదివారం ఉదయం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పలువురికి మంత్రివర్గంలో కొత్తగా స్థానం లభించనుంది. మరోవైపు, అధిష్ఠానం సూచనల మేరకు ఇప్పటికే పలువురు తమ పదవులకు రాజీనామా చేశారు.