: ‘జనసేన’ సోషల్ మీడియా టీమ్ కు ‘శతఘ్ని డిజిటల్ రెజిమెంట్’గా నామకరణం


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన సోషల్ మీడియా టీమ్ కు ‘శతఘ్నిడిజిటల్ రెజిమెంట్’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. యువతతో పవన్ కల్యాణ్ ముఖాముఖికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను ఈ రోజు సాయంత్రం ప్రసారం చేయనున్నామని, ఈ కార్యక్రమాన్ని ‘శతఘ్ని డిజిటల్ రెజిమెంట్’ నిర్వహిస్తుందని  పేర్కొంది. కాగా, ‘జనసేన డిజిటల్ అస్త్రం శతఘ్నికి శతకోటి వందనాలు’, ‘సూపర్’, ‘సూపర్బ్’ అంటూ ఈ ట్వీట్ పై నెటిజన్లు స్పందించారు.

  • Loading...

More Telugu News