: నీతి అయోగ్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ కుమార్
నీతి అయోగ్ వైస్ చైర్మన్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా స్థానంలో రాజీవ్ కుమార్ చేరారు. రాజీవ్ కుమార్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చీలో సీనియర్ ఫెలో. ఆయనకు ఆక్స్‌ఫర్డ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో డీఫిల్‌తో పాటు లక్నో విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ ఉన్నాయి. గతంలో ఫిక్కీకి సెక్రటరీ జనరల్‌గా కూడా రాజీవ్ కుమార్ పనిచేశారు. 2006 - 08 మధ్య నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా సీఐఐలో, ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో, ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆయన కీలక బాధ్యతలు పోషించారు.