: భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ 'స్నాప్ డీల్' మూడు రోజుల ఫెస్టివ్ డీల్
ఈ కామర్స్ సేవల దిగ్గజం స్నాప్ డీల్ మూడు రోజుల పాటు ఫెస్టివ్ సేల్ అమ్మకాలను ప్రకటించింది. నేటి నుంచి ఆదివారం వరకూ సాగే అమ్మకాల్లో భాగంగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లను అందించనున్నట్టు పేర్కొంది. మరో ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇప్పటికే ఇదే తరహా సేల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెజాన్ నుంచి పోటీనీ తట్టుకునేందుకు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ విలీనం కానున్నాయని గత నెలలో వార్తలు వచ్చాయి. విలీనంపై స్పష్టమైన ప్రకటన అతి త్వరలో వెలువడుతుందని సమాచారం.
ఇక మూడు రోజుల అమ్మకాల్లో భాగంగా తమ కస్టమర్లకు నచ్చేలా రెండంకెల్లో డిస్కౌంట్ ఆఫర్లను దగ్గర చేశామని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిపై అదనంగా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులను వాడితే, 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. ఈ డిస్కౌంట్ కావాలంటే కనీసం రూ. 2,500 విలువైన షాపింగ్ చేసుండాలని నిబంధన కూడా విధించింది. పూర్తి ఆఫర్ల వివరాలు వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది.