prabhas: ప్రభాస్ తన పారితోషికం తగ్గించుకున్నాడా?


'బాహుబలి' .. 'బాహుబలి 2' రెండు సినిమాల కోసం ప్రభాస్ దాదాపు అయిదేళ్లు కేటాయించాడు. ఇందుకుగాను ఆయనకి 80 కోట్లవరకూ పారితోషికం ముట్టిందనే వార్తలు వచ్చాయి. అంత సమయాన్ని కేటాయించినందుకు ఆయన ఆ మాత్రం పారితోషికాన్ని అందుకోవడం సబబేననే టాక్ కూడా వినిపించింది. ఈ పారితోషికాన్ని లెక్కలోకి తీసుకుని .. తరువాత సినిమాకి తాను కేటాయించే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ పారితోషికాన్ని తీసుకోవలసి ఉంటుంది.

కానీ ప్రస్తుతం తాను చేస్తోన్న 'సాహో' సినిమా కోసం ఆయన తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ తన హోమ్ బ్యానర్ లాంటిది కావడం వలన .. సినిమా బడ్జెట్ భారీగా ఉండటం వలన .. ఆ ఖర్చుల గురించి ఆలోచించి ఆయన తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడని చెబుతున్నారు. బహు భాషా చిత్రం కనుక .. లాభాల్లో వాటా దక్కితే దక్కొచ్చు.    

prabhas
shraddha kapoor
  • Loading...

More Telugu News