: థియేటర్లో అభిమానులతో కలసి సందడి చేసిన బాలకృష్ణ!


ఈ ఉదయం వెండి తెరలను తాకిన తన 101వ చిత్రం 'పైసా వసూల్'ను అభిమానులతో కలసి నందమూరి బాలకృష్ణ వీక్షించారు. హైదరాబాద్, కూకట్ పల్లిలోని తనకు ఇష్టమైన భ్రమరాంబ థియేటరుకు వచ్చిన ఆయన, చిత్రాన్ని వీక్షించి తన సంతృప్తిని వ్యక్తం చేశారు. చిత్రం చూస్తున్నంతసేపూ అభిమానులు కేరింతలు కొడుతుంటే బాలయ్య నవ్వుతూ కనిపించారు. ఆయనతో పాటు దర్శకుడు పూరీ జగన్నాధ్, హీరోయిన్ లు శ్రియ, చార్మి తదితరులంతా సినిమా చూసేందుకు రావడంతో థియేటర్ వద్ద సందడి నెలకొంది. చిత్రం చాలా బాగుందని పలువురు అభిమానులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News