: అమెరికా, రష్యా మధ్య ముదురుతున్న విభేదాలు.. తమ దేశంలోని మూడు రాయబార కార్యాలయాలు మూసేయమంటూ అమెరికా ఆదేశం!


అమెరికా, రష్యాల మధ్య విభేదాలు రోజురోజుకి మరింత పెరుగుతున్నాయి. ఉత్తర కొరియాపై సైనిక చర్యకు దిగితే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ అమెరికాను రష్యా హెచ్చరించింది. ఉత్తర కొరియాపై సైనిక చర్య ఆలోచనను విరమించుకోవాలని సూచించింది. రష్యా తమకు నీతులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా దేశంలోని మూడు రష్యా రాయబార కార్యాలయాలను మూసివేయాలంటూ ఆ దేశానికి అల్టిమేటం జారీ చేసింది. శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్‌లో ఉన్న మూడు కార్యాలయాలను రష్యా మూసివేయాలని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ రష్యా దౌత్య అధికారులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News