: రైల్లో విజయవాడ అమ్మాయిపై వేధింపులకు పాల్పడ్డ యువకుల అరెస్టు
ఈ రోజు నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడ యువతి వేధింపులకు గురై, రైల్లో నుంచి దూకేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేధింపులకు పాల్పడ్డవారిని అరెస్టు చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. వారిలో ఖుర్భాన్ అనే నిందితుడు బీహార్‌కు చెందిన వాడు కాగా హరికేష్ యాదవ్, సుధాకర్ అనే మరో ఇద్దరు పోకిరీలు యూపీకి చెందిన వారని పోలీసులు గుర్తించారు. వారిని పోలీస్‌స్టేషన్‌కి తరలించామని, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.