: ఆలస్యం కానున్న ‘జియో’ స్మార్ట్ ఫోన్ డెలివరీ?
‘జియో’ స్మార్ట్ ఫోన్ ను అందుకోవాలని ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఓ సమాచారం. ఇప్పటికే ఈ స్మార్ ఫోన్ బుక్ చేసుకున్న వినియోగదారులు సెప్టెంబర్ మొదటి వారంలో వాటిని అందుకుంటారని సంస్థ గతంలో ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ల డెలివరీకి మరింత సమయం పడుతుందని తెలుస్తోంది. జియో ఫోన్లు తమ స్టోర్స్ కు రావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని రిలయన్స్ డిజిటల్ స్టోర్ కు చెందిన ఓ ఉద్యోగి తెలిపారు.
కాగా, ‘జియో ఫోన్..ఇండియా కా స్మార్ట్ ఫోన్’ అనే ప్రకటనతో ఈ నెల 24 నుంచే ఈ ఫోన్ ఫ్రీ- బుకింగ్స్ ను సంస్థ ప్రారంభించింది. అంచనాలకు మించి వినియోగదారుల నుంచి స్పందన వచ్చింది. 3 నుంచి 4 మిలియన్ యూనిట్ల వరకు ఈ స్మార్ట్ ఫోన్లను బుక్ చేసుకోవడం జరిగింది. దీంతో, ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ ను సంస్థ ఒక్కసారిగా నిలిపివేసింది. ఈ క్రమంలో, ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ చేసుకున్నవారికి ఫోన్ల డెలివరీ కూడా ఆలస్యం కానున్నట్టు సమాచారం.