: భారత బౌలర్ల ధాటికి ఆదిలోనే వెనుదిరిగిన శ్రీలంక టాప్ ఆర్డర్.. శార్దూల్ ఠాకూర్, బుమ్రాల‌కి చెరో వికెట్


శ్రీలంక‌లోని కొలంబో వేదికగా జ‌రుగుతోన్న శ్రీలంక, టీమిండియా నాలుగో వ‌న్డే మ్యాచులో భార‌త్ ఇచ్చిన భారీ ల‌క్ష్య సాధ‌న‌ను ఛేదించ‌డంలో శ్రీలంక త‌డ‌బ‌డుతోంది. టీమిండియా బౌల‌ర్ల ధాటికి 33 పరుగులకే మూడు వికెట్లు సమర్పించుకుంది. 2.4 ఓవర్లలో 22 పరుగుల వద్ద నిరోషన్ డిక్ వెల్లా అవుట్ కాగా, 5.2 ఓవ‌ర్ల‌లో 26 పరుగుల వద్ద మెండిస్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దిల్షాన్ మున‌వీరా 8 ఓవ‌ర్ లో 37 ప‌రుగుల‌ వద్ద అవుట‌య్యాడు. టీమిండియా బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్, బుమ్రాల‌కి చెరో వికెట్ ద‌క్కింది. ప్ర‌స్తుతం శ్రీలంక స్కోరు 14 ఓవ‌ర్లకి 57గా ఉంది. శ్రీలంక బ్యాట్స్ మెన్ లో నిరోషన్ డిక్ వెల్లా 14, మెండిస్ 1, దిల్షాన్ మున‌వీరా 11 పరుగులు చేశారు. 

  • Loading...

More Telugu News