: గుర్మీత్ బాబాకు పట్టిన గతే జగన్‌కూ ప‌డుతుంది.. రోజా గురించి త‌క్కువ‌గా మాట్లాడుకుంటే మంచిది: మ‌ంత్రి కొల్లు ర‌వీంద్ర


డేరా స్వ‌చ్చ సౌధా చీఫ్ గుర్మీత్ బాబాకు ప‌ట్టిన‌ గ‌తే వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కూడా ప‌డుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి కొల్లు ర‌వీంద్ర వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఇక ఎమ్మెల్యే రోజా గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే ప్రజలకు అంత మంచిదని చుర‌క‌లంటించారు. కడపను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తేనే గానీ జ‌గ‌న్ సీఎం కావ‌డం అనే క‌ల నెర‌వేర‌బోద‌ని వైసీపీ నేతలే జోకులు వేసుకుంటున్నార‌ని ఆయ‌న చుర‌క‌లంటించారు. నంద్యాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన‌ ఫలితమే కాకినాడలోనూ వ‌స్తుంద‌ని జోస్యం చెప్పారు. నంద్యాలలో గెల‌వ‌డానికి వైసీపీ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఓడింద‌ని విమ‌ర్శించారు.  

  • Loading...

More Telugu News