: బీరు లోడుతో వెళుతున్న లారీ బోల్తా.. బీరు కోసం ఎగబడ్డ స్థానికులు!


బీరు లోడుతో ర‌హ‌దారిపై వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడిపోవ‌డంతో ఆ సీసాల‌ను కొట్టేసేందుకు స్థానికులు ఎగ‌బ‌డిన ఘ‌ట‌న‌ నల్గొండ జిల్లాలోని వేములపల్లి సమీపంలో చోటు చేసుకుంది. అందులో కొన్ని బీర్ సీసాలు ప‌గిలిపోయాయి. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని, స్థానికులు ఆ బీర్ సీసాలను ఎత్తుకెళ్లకుండా చూశారు. ఈ ఘ‌ట‌న‌లో స‌ద‌రు లారీ డ్రైవర్‌కు గాయాల‌య్యాయి. బీరు సీసాలు ప‌గిలిపోవ‌డంతో దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం ఉంటుందని అంచనా వేశారు. 

  • Loading...

More Telugu News