: సీనియర్ సిటిజన్ పై చేయి చేసుకున్న క్రికెటర్ అంబటి రాయుడు!
ఓ సీనియర్ సిటిజన్ పై క్రికెటర్ అంబటి రాయుడు చేయి చేసుకున్న సంఘటనపై తోటి సీనియర్ సిటిజన్లు మండిపడుతున్నారు. హైదరాబాద్ లోని హబ్సిగూడ లో ఉన్న జెన్ పాక్ కాలనీలో అంబటి రాయుడు నివసిస్తున్నాడు. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్లు ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్ కి వెళ్లారు. ఇదే సమయంలో అంబటి రాయుడు తన కారులో వేగంగా అటువైపు వెళ్లగా, ఆయన కారు ఓ సీనియర్ సిటిజన్ కు తగిలింది. వెంటనే అప్రమత్తమైన తోటి సీనియర్ సిటిజన్లు ఈ విషయమై అంబటి రాయుడిని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఆయన మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండని వారిని బెదిరించినట్టు తెలుస్తోంది. కాగా, బాధిత సీనియర్ సిటిజన్ కు గాయాలయ్యాయి. అంబటి రాయుడు, బాధిత సీనియర్ సిటిజన్ పరస్పరం తిట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయనపై అంబటి రాయుడు చేయిచేసుకున్నాడు.